వైభవంగా నృసింహుడి కల్యాణం

ABN , First Publish Date - 2021-05-02T05:51:00+05:30 IST

మండలంలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో నిత్యశాశ్వత కల్యాణాన్ని కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అర్చకులు శనివారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా నృసింహుడి కల్యాణం
కల్యాణం జరిపిస్తున్న వేద పండితులు

మఠంపల్లి, మే 1: మండలంలోని మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో నిత్యశాశ్వత కల్యాణాన్ని కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అర్చకులు శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విశ్వక్ష్సేన పూజ, పుణ్యహవాచనం, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, అష్టోత్తర సహస్త్ర కుంకుమార్చన, అనంతరం కల్యాణ తంతులో భాగంగా ఎదుర్కోళ్ల మహోత్సవంతో కల్యాణాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, ఈవో సిరికొండ నవీన్‌, ఆలయ అర్చకులు,ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-05-02T05:51:00+05:30 IST