టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్
ABN , First Publish Date - 2021-10-21T06:48:06+05:30 IST
టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్ తరఫున నామినేషన్ దాఖలు చేసినట్లు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి తెలిపారు.
సీఎం తరఫున దాఖలు చేసిన జడ్పీ చైర్మన్లు
భువనగిరి రూరల్, అక్టోబరు 20: టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్ తరఫున నామినేషన్ దాఖలు చేసినట్లు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డికి బుధవారం నామినేషన్ అందజేసినట్లు వివరించా రు. ఆయనవెంట సూర్యాపేట జిల్లా జడ్పీ చైర్మన్ దీపిక యుగంధర్, వివిధ జిల్లా ల టీఆర్‌ఎస్ జడ్పీ చైర్మన్లు పాల్గొన్నారు.