నోయిడా టు వైజాగ్‌

ABN , First Publish Date - 2021-05-18T06:52:22+05:30 IST

కరోనా చికిత్సలో ఆక్సిజన్‌ అవసరం పెరిగిన నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు.

నోయిడా టు వైజాగ్‌

కరోనా చికిత్సలో ఆక్సిజన్‌ అవసరం పెరిగిన నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు అవసరమైన విడి భాగాలను పరిశ్రమల నుంచి వివిధ మార్గాల్లో చేరవేస్తున్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్‌ ప్లాంట్లలో వినియోగించనున్న ప్రెషర్‌ ట్యాంకర్లను ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలోని పారిశ్రామికవాడ నుంచి కంటైనర్‌ ద్వారా రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. మార్గమఽధ్యలో తుర్కపల్లి, భువనగిరి గుండా భారీ కంటైనర్‌ సోమవారం తరలివెళ్లింది. అడ్డంగా ఉన్న తీగలను, చెట్ల కొమ్మలను తొలగించి తీసుకెళ్లారు. కాకినాడ పోర్టువరకు రోడ్డు మార్గంలో వెళ్లి అక్కడి నుంచి జలమార్గంలో ఓడల్లో విశాఖపట్నానికి ప్రెషర్‌ ట్యాంకర్లను చేరవేయనున్నట్లు సిబ్బంది తెలిపారు.  

- భువనగిరిటౌన్‌/ తుర్కపల్లి.

Updated Date - 2021-05-18T06:52:22+05:30 IST