నడిగూడెంలో తొమ్మిది కేజీల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-10-19T06:19:44+05:30 IST

జాతీయ రహదారి 65మీదుగా ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతున్న గంజాయిని నడిగూడెం పోలీసులు సోమవారం పట్టుకున్నారు.

నడిగూడెంలో తొమ్మిది కేజీల గంజాయి పట్టివేత

నడిగూడెం, అక్టోబరు 18 : జాతీయ రహదారి 65మీదుగా ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతున్న గంజాయిని నడిగూడెం పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఛత్తీ్‌సఘడ్‌ రాష్ట్రం జగదల్‌పూర్‌కు చెందిన దేవరాజునాయక్‌ ముంబయికి తొమ్మిది కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా ముంబయికి వెళ్లే ప్రయత్నంలో గుంజలూరు స్టేజీ వద్ద పోలీసులు తనిఖీ చేస్తున్నారని తెలిసి మార్గమధ్యలో మునగాలలో దిగాడు. అక్కడ నుంచి నారాయణపురం మీదుగా నడిగూడేనికి నడిచి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ ఏడుకొండలు సిబ్బందితో వెళ్లి తనిఖీ చేయగా దేవరాజు వద్ద తొమ్మిది కిలోల గంజాయి పట్టుబడింది. విషయాన్ని మునగాల సీఐకి తెలపగా విచారణ నిర్వహించిన ఆయన దేవరాజుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. దీని విలువ రూ.50వేలు ఉంటుందన్నారు.


Updated Date - 2021-10-19T06:19:44+05:30 IST