పెద్దకాపర్తిలో పట్టపగలు చోరీ

ABN , First Publish Date - 2021-10-29T06:41:02+05:30 IST

Daytime theft in Peddakaparthi

పెద్దకాపర్తిలో పట్టపగలు చోరీ

చిట్యాల రూరల్‌, అక్టోబరు 28:  మండలంలోని పెద్దకాపర్తిలో ఇంట్లో ఎవరూలేని సమయంలో పట్టపగలు చోరీ గురువారం  చోరీ జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన నల్లబెల్లి నర్సింహ తన ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లారు. సాయంకాలం తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండటంతో లోనికి వెళ్లి చూసే సరికి  రెండు తులాల బంగారం, 30 తులాల వెండి, రూ. 30 వేల నగదును చోరీకి గురైనట్లు నిర్ధారించుకున్నారు. ఈమేరకు చిట్యాల పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2021-10-29T06:41:02+05:30 IST