కారు ఢీకొని యాచకుడి మృతి

ABN , First Publish Date - 2021-10-29T06:39:31+05:30 IST

Beggar killed in car crash

కారు ఢీకొని యాచకుడి మృతి

దామరచర్ల, అక్టోబరు 28 :  మండలంలోని కొండ్రపోలు శివారులో వేగంగా వెళ్తున్న కారు ఢీకొని యాచకుడు గురువారం మృతిచెందాడు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 60 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి గత కొంతకాలంగా కొండ్రపోలు పరిసర గ్రామాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. ఈక్రమంలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి దాటుతుండగా మిర్యాలగూడ నుంచి గుంటూరు వైపు వేగంగా వెళ్తున్న కారు యాచకుడిని ఢీకొట్టింది. దీంతో బలమైన గాయాలతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని మిర్యాలగూడ మార్చురీకి తరలించారు. మృతదేహానికి సంబందించిన వ్యక్తులు పోలీ్‌సస్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.


Updated Date - 2021-10-29T06:39:31+05:30 IST