రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-10-19T06:18:55+05:30 IST

రోడ్డు ప్రమాదం లో మహిళ మృతిచెందింది. ఈ సంఘటన మండల కేంద్రంలోని నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై సో మవారం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
నీల(ఫైల్‌)

వేములపల్లి, అక్టోబరు 18 : రోడ్డు ప్రమాదం లో మహిళ మృతిచెందింది. ఈ సంఘటన మండల కేంద్రంలోని నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై సో మవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం  ప్రకారం త్రిపురారం మండలం అల్వలపాడ్‌కు ఇస్లావత శ్రీను, నీల(38) దంపతులు కూతురు అనూషను కళాశాలకు పంపేందుకు బైక్‌పై నల్లగొండకు బయలుదేరారు. అనూషను నల్లగొండలో బస్సు ఎ క్కించి తిరిగి ఇంటికి వెళ్తుండగా వేములపల్లి మండల కేంద్రంలో బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన పెట్రోల్‌ ట్యాంకర్‌ ఢీకొంది. వాహనంపై ఉన్న నీల కిందపడగా ఆమె తలపై నుంచి ట్యాంకర్‌ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. భర్త శ్రీను హెల్మెట్‌ ధరించడంతో స్వల్పగాయాల య్యాయి. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్న ట్లు ప్రొహిబిషన ఎస్‌ఐ రేణుక తెలిపారు.


Updated Date - 2021-10-19T06:18:55+05:30 IST