‘దళితబంధు’తో కొత్త విప్లవం

ABN , First Publish Date - 2021-10-28T05:34:13+05:30 IST

‘దళితబంధు’ పథకం తో దేశంలో కొత్త విప్లవం రాబోతోందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

‘దళితబంధు’తో కొత్త విప్లవం
వాసాలమర్రి గ్రామంలో దళితబంధు యూనిట్లను పంపిణీ చేస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

దళితుల జీవితాల్లో ఇక వెలుగులే

 అంబేడ్కర్‌ ఆశయాలను నెరవేర్చిన నాయకుడు సీఎం కేసీఆర్‌ 

 విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి 

తుర్కపల్లి, అక్టోబరు 27: ‘దళితబంధు’ పథకం తో దేశంలో కొత్త విప్లవం రాబోతోందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సీఎం దత్త త గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో దళితబంధు పథకం కింద మంజూరైన 10 యూనిట్ల ను బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు పథ కం ప్రపంచంలోని ఇతర దేశాలకు ఓ మార్గం చూపబోతోందన్నారు. గతంలో డ్రైవర్లుగా ఉన్నవారు, ప్రస్తు తం ఓనర్లుగా మారారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ మేథస్సు నుంచి వచ్చి ఒక ఆలోచన దళితుల జీవితా ల్లో వెలుగులు నింపబోతోందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాని కావాలి అన్న ముఖ్యమంత్రి ఆశయం అంతకుమించి నెరవేరిందన్నారు. బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకు ప్రభుత్వం తరఫున నూతన వస్ర్తాలు పంపిణీ చేయడం, అన్నివర్గాలకు సమన్యాయం ఇవ్వడమేనన్నారు. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి రైతులకు అంకితమిచ్చారన్నారు. బీఆర్‌ అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం వల్లే దేశం పటిష్టంగా ఉందని, వారి ఆలోచనలను నెరవేర్చిన సీఎం కేసీఆర్‌ ప్రగతిశీల నాయకుడయ్యారన్నారు. 


వాసాలమర్రి నుంచి ప్రకటించడం అదృష్టం : విప్‌ సునీత 

సీఎం కేసీఆర్‌ వాసాలమర్రి గ్రామం నుంచి దళి తబంధు పథకాన్ని ప్రకటించడం మన అదృష్టమని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మ హేందర్‌రెడ్డి అన్నారు. లబ్ధిదారులకు దేనిలో నైపుణ్యం ఉంటే, అందులో ఆర్థికసాయం చేయాలని సీఎం భా వించారని, బ్యాంక్‌లతో సంబంధం లేకుండా డైరెక్ట్‌గా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమచేస్తున్నట్లు తెలిపారు. దళిత కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థికసా యం అందించి వారి ఆర్థిక ఉన్నతికి గ్రామంలోనే ఉపాధికల్పనలో శిక్షణ ఇవ్వడం అభినంద నీయమన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌ మాట్లాడుతూ గ్రామంలో 76 కుటుంబాలకు దళిత బంధు పథకం ద్వారా 7.60 కోట్లను ప్రభుత్వం జమచేసిందని, మొదట 10 మంది లబ్ధిదారులకు వాహనాలు అందించినట్లు తెలిపారు. మిగిలిన వారికి వారం, 10 రోజుల్లో పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందుగా ఏడు గూడ్సు వాహనాలు, రెండు డోజర్లు, ఒక ప్యాసింజర్‌ ఆటోను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, కలెక్టర్‌ పమేలాసత్పథి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ వై్‌సచైర్మన్‌ ధనావత్‌ బీకూనాయక్‌, ఎస్సీ కార్పొరేషన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ ఆనంద్‌, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్‌నాయక్‌, సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు. 


రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి

భువనగిరి రూరల్‌: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరిలో రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాల అధికారులు, రైస్‌మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో వరి సాగు చేయవద్దని, ఈ విషయాన్ని రైతులకు చెప్పేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాటానికి పోవద్దన్నారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాల న్నారు. అందుకు అనుగుణంగా రైతుల్లో అవగాహన పెంపొందించాలని వ్యవసా య శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే కందు లు, నువ్వులు, మినుములు, ఆవాలు, వేరుశనగ, పెసర పంటలు సాగు చేసుకునేలా చైతన్యపర్చాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, డీఆర్‌డీవో ఎం.ఉపేందర్‌రెడ్డి, డీసీఎ్‌సవో బ్రహ్మారావు, పౌరసరఫరాల డీఎం గోపీకృష్ణ, డీఏవో కె.అనురాధ, డీసీవో పరిమళాదేవి, డీఎంవో సబిత పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-28T05:34:13+05:30 IST