నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-10-19T06:44:57+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌లో రైతుల ప్రాణాలు తీసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం రైల్‌ రోకో, ధర్నాలు చేశారు. ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు. రైతులకు న్యాయం చేయాలని నాయకులు, కార్యకర్తలు నినదించారు.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
రామన్నపేట రైల్వే స్టేషన్‌ ఎదుట ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌లో  రైతుల ప్రాణాలు తీసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం  రైల్‌ రోకో, ధర్నాలు చేశారు. ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దహనం చేశారు.  రైతులకు న్యాయం చేయాలని నాయకులు, కార్యకర్తలు నినదించారు. 

రామన్నపేట, అక్టోబరు 18: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయా లని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌ కోరారు. ఈ మేరకు  రామ న్నపేటలో  రైతు సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో రైల్‌ రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు.   ఈ సందర్బంగా రైతు శాంతి యుతంగా  నిరసన తెలుపు తున్న రైతులపై  కాన్వాయ్‌తో ఢీకొట్టి నలు గురు రైతు లను హత్య చేసిన వారిపై చర్యలు తీసు కోవాలని ఆయ న డిమాండ్‌ చేశారు.  ఈ కార్య క్రమంలో వ్యకాస జిల్లా సహయ కార్య దర్శి పెంటయ్య, బొడ్డుపల్లి వెంక టేశం, బోయిని ఆనంద్‌, వైస్‌ ఎంపీపీ ఉపేందర్‌,  పాల్గొన్నారు. 

భువనగిరి రూరల్‌: భువనగిరి మండలం బస్వాపురంలో సీపీఎం ఆధ్వర్యంలో మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు.ఈ కార్యక్రమంలో  అన్నంపట్ల కృష్ణ, వెంకటేశ్‌ పాల్గొన్నారు. 

చౌటుప్పల్‌ రూరల్‌: చౌటుప్పల్‌ మండలం మందోళ్ళగూడెంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో  బూరుగు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ చెన్నబొయిన వెంకటేశం, కొండె శ్రీశైలం, శేఖర్‌ పాల్గొన్నారు.

మోటకొండూరు: మండలంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో  సీపీఎం మండల కార్యదర్శి బొలగాని జయరాములు, కొల్లూరి ఆంజనే యులు, రమేశ్‌, విజయలక్ష్మి, రోమన్‌, దశరథ, సుధాకర్‌ పాల్గొన్నారు. 

భూదాన్‌పోచంపల్లి:  సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో  సీపీఎం మండల, పట్టణ కార్యదర్శులు పగిల్ల లింగారెడ్డి, కోడి బాల్‌నర్సింహ, గూడూరు అంజిరెడ్డి, మండల కమిటీ సభ్యులు కోట రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.

మోత్కూరు: మండలంలోని పాలడుగులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.  కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, నాయకులు దడిపెల్లి ప్రభాకర్‌, కొంపెల్లి ముత్తమ్మ, పిట్టల చంద్రయ్య, సోమరాజు, లక్ష్మణ్‌, సైదులు, గంగయ్య పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలోని  గాంధీ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి ఆర్‌.సత్తయ్య, ఆర్‌.గోవర్దన్‌, సీహెచ్‌ మల్లేశం, పాల్గొన్నారు.

తుర్కపల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కల్లూరి మల్లేశం, పొతరాజు జహంగీర్‌, పాల్గొన్నారు.


భువనగిరి మండలం బస్వాపురంలో ప్రధాన మంత్రి మోదీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సీపీఎం నాయకులు
Updated Date - 2021-10-19T06:44:57+05:30 IST