రుణాలతో జీవనోపాధి పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2021-08-25T06:19:21+05:30 IST

ప్రభుత్వం అందజేస్తున్న రుణాలతో మహిళలు జీవనోపాఽధిని పెంపొందించుకోవాలని డీఆర్డీవో పీడీ కిరణ్‌కుమార్‌ అన్నారు.

రుణాలతో జీవనోపాధి పెంపొందించుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్డీవో పీడీ కిరణ్‌కుమార్‌

పెన్‌పహాడ్‌, ఆగస్టు 24: ప్రభుత్వం అందజేస్తున్న రుణాలతో మహిళలు జీవనోపాఽధిని పెంపొందించుకోవాలని డీఆర్డీవో పీడీ కిరణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మహిళా సమాఖ్య సర్వజన సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణాలను సకాలంలో చెల్లించాలని కోరారు. మండల పరిధిలో 38 సమభావన సంఘాలకు గాను ఒక్కో సంఘానికి రూ.15 వేలు రీవాల్యూ ఫండ్‌ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. డీఎంఎ్‌ఫఎంఈ పథకం ద్వారా 68 సమాభావన సంఘాలను ఒక్కో సంఘానికి రూ.47 వేల చొప్పున మహిళలు జీవనోపాధులను మెరుగుపర్చుకోవడానికి అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. పొదుపు సంఘాలను బలోపేతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మామిడి అనిత, డీపీఎం లక్ష్మీనారాయణ, ఏపీఎం రాంబాబు, డీఎంజీ మల్లయ్య, సీసీలు పద్మావతి, శ్రీనివాస్‌, రాజ్యలక్ష్మీ, స్వరూప పాల్గొన్నారు.

Updated Date - 2021-08-25T06:19:21+05:30 IST