యాదాద్రి ప్రధానార్చకుడు లక్ష్మీనరసింహాచార్యులకు జాతీయ విద్యారత్న అవార్డు

ABN , First Publish Date - 2021-01-12T06:22:32+05:30 IST

యాదాద్రి ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్‌ లక్ష్మీనరసింహాచా ర్యులకు 2021 సంవత్సరానికి గాను జాతీయ విద్యారత్న అవార్డును సోమవారం బహుజన సాహిత్య అకాడమీ కమిటీ సభ్యులు అందజేశారు.

యాదాద్రి ప్రధానార్చకుడు లక్ష్మీనరసింహాచార్యులకు జాతీయ విద్యారత్న అవార్డు

యాదాద్రి టౌన్‌, జనవరి 11: యాదాద్రి ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్‌ లక్ష్మీనరసింహాచా ర్యులకు 2021 సంవత్సరానికి గాను జాతీయ విద్యారత్న అవార్డును సోమవారం  బహుజన సాహిత్య అకాడమీ కమిటీ సభ్యులు అందజేశారు. మండల పరిధిలోని హయగ్రీవస్థాయి సన్నిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బహుజన సాహిత్య అకాడమీ ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. వచ్చే మార్చి 14న తిరుపతిలో జరిగే సౌత్‌ ఇండియా బహుజన రైటర్స్‌ 4వ జాతీయ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారని, ఈ కార్యక్రమంలో యాదాద్రి ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులకు విద్యారత్న అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు.  కార్యక్రమానికి సౌత్‌ ఇండియాలోని సుమారు 600 డెలిగేట్స్‌ హాజరుకానున్నారని తెలిపారు. కార్యక్రమంలో నేషనల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.విజయలలిత, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల విజయకుమార్‌ ఉన్నారు. 

Updated Date - 2021-01-12T06:22:32+05:30 IST