సీనియర్‌ సివిల్‌ జడ్జిగా నర్సింహమూర్తి

ABN , First Publish Date - 2021-08-28T04:58:16+05:30 IST

హుజూర్‌నగర్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా సీహెచ్‌.అప్పలనర్సింహమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్టార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సీనియర్‌ సివిల్‌ జడ్జిగా నర్సింహమూర్తి

హుజూర్‌నగర్‌, ఆగస్టు 27 : హుజూర్‌నగర్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా సీహెచ్‌.అప్పలనర్సింహమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్టర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సికింద్రాబాద్‌లోని 18వ ముఖ్యఅదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ర్టేట్‌గా పనిచేస్తున్న ఆయన్ను హుజూర్‌నగర్‌కు బదిలీ చేశారు. కాగా ఇక్కడ పనిచేసిన సివిల్‌ జడ్జి శ్రీనివాసరావు పదోన్నతిపై హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. నర్సింహమూర్తి నియామకంపై బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి, అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాస్‌, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-08-28T04:58:16+05:30 IST