సమన్వయంతో ‘స్మైల్‌’ను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-12-31T16:30:12+05:30 IST

జనవరి నెలలో జరగను న్న ఆపరేషన్‌ స్మైల్‌-8ను అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా అదనపు ఎస్పీ నర్మద సూచించా రు.

సమన్వయంతో ‘స్మైల్‌’ను విజయవంతం చేయాలి

 జిల్లా అదనపు ఎస్పీ నర్మద 

నల్లగొండ క్రైం, డిసెంబరు 30: జనవరి నెలలో జరగను న్న ఆపరేషన్‌ స్మైల్‌-8ను అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా అదనపు ఎస్పీ నర్మద సూచించా రు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కార్మిక, స్త్రీశిశు సం క్షేమ, పోలీస్‌, బాలల సంక్షేమ సమితి, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తప్పిపోయిన బా లలను గుర్తించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కృషి చేయాలన్నారు. పిల్లలతో పనులు చేయిస్తున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేయడం ద్వారా బాల కార్మికులకు విముక్తి కల్పించేలా ఆపరేషన్‌ స్మైల్‌ బృందాలు పనిచేయాలన్నారు. ఆపరేషన్‌ స్మైల్‌ విజయవంతం కోసం సబ్‌ డివిజన్‌ పరిధిలో ఎస్‌ఐ, నలుగురు పీసీలను ప్రత్యేకంగా కేటాయించి చైల్డ్‌లైన్‌తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాల కార్మిక వ్య వస్థ నిర్మూలన కోసం బాధ్యతాయూతంగా కృషి చేయాలని అన్నా రు. సమావేశంలో సీఐ సురేష్‌, బాలల పరిరక్షణ అధికారి కాసాని గణేష్‌, ఎస్‌ఐలు రాంబాబు, శంకరయ్య, రామకృష్ణ, నందులాల్‌, జిల్లా శిశుసంక్షేమ అధికారి సుభద్ర, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణ, సభ్యులు భాస్కర్‌, లక్ష్మీకిరణ్‌, శ్రీనివా్‌సరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T16:30:12+05:30 IST