నరసింహకు గ్లోబెల్‌ హ్యుమన ఎక్స్‌లెన్సీ అవార్డు

ABN , First Publish Date - 2021-10-25T05:59:26+05:30 IST

మండలంలోని వేములకొండ పీహెచసీ ఆరోగ్య పర్యవేక్షకుడు ఎన.నరసింహకు అంతర్జాతీయ మానవ ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు.

నరసింహకు గ్లోబెల్‌ హ్యుమన ఎక్స్‌లెన్సీ అవార్డు
అవార్డును అందుకుంటున్న నాశబోయిన నరసింహ

నరసింహకు గ్లోబెల్‌ హ్యుమన ఎక్స్‌లెన్సీ అవార్డు 

వలిగొండ, అక్టోబరు 24: మండలంలోని వేములకొండ పీహెచసీ ఆరోగ్య పర్యవేక్షకుడు ఎన.నరసింహకు అంతర్జాతీయ మానవ ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్కృతి, దౌత్య సంబంధాల అంతర్జాతీయ కమిషన, వే ఫౌండేషన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నరసింహ కు ఈ అవార్డును అందజేశారు. వైద్యారోగ్య రంగంలో క్షేత్రస్థాయిలో అవగాహన, సామాజిక సాహితీ రంగంలో సామాజిక చైతన్యం నింపినందుకు ఈ అవార్డు దక్కింది. శ్రీలంకకు చెందిన మదర్‌కేర్‌ గ్లోబల్‌ ఫౌండేషన ఆసియా చైర్మన డాక్టర్‌ ధర్మలింగం థారేసనన, ఈస్ట్‌ ఆఫ్రికాకు చెంది న అవనింద్రకుమార్‌, మెడికైడేతోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన డాక్టర్‌ శివరామకృష్ణ, డిప్యూటీ సీఈవో ఖమ్మం చంద్రశేఖర్‌ ఈ అవార్డును అందజేశారు. 
Updated Date - 2021-10-25T05:59:26+05:30 IST