నందికొండ.. నిండుకుండ

ABN , First Publish Date - 2021-08-01T06:14:14+05:30 IST

కృష్ణా పరివాహక ప్రాంతంలో సాగర్‌కు ఎగువనున్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో మూడురోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 4,67,920 క్యూసెక్కుల నీటిని, మొదటి జలవిద్యుత్‌ కేం ద్రం నుంచి 30,640 క్యూసెక్కుల నీటిని 2వ జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

నందికొండ.. నిండుకుండ

573.90 అడుగులకు చేరిన నాగార్జున సాగర్‌ నీటిమట్టం

నాగార్జునసాగర్‌, జూలై 31: కృష్ణా పరివాహక ప్రాంతంలో సాగర్‌కు ఎగువనున్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. దీంతో మూడురోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 4,67,920 క్యూసెక్కుల నీటిని, మొదటి జలవిద్యుత్‌ కేం ద్రం నుంచి 30,640 క్యూసెక్కుల నీటిని 2వ జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్‌ ప్రాజెక్టుకు 5,30,352 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు ఎగువ జూరాల, సుంకేసుల నుంచి 5,31,774 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 573.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 266.3582 టీఎంసీలుగా ఉంది.   


పులిచింతలలో కొనసాగుతున్న నీటి విడుదల

చింతలపాలెం: చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టుకు సాగర్‌ నుంచి 38701 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెండు క్రస్ట్‌గేట్లు ఎత్తి 24,901 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175అడుగులు(45.77టీఎంసీలు)కాగా, 173.25అడుగులకు(43.10టీఎంసీలు) చేరుకుంది.

Updated Date - 2021-08-01T06:14:14+05:30 IST