నాంపల్లి ఎస్‌ఐను సస్పెండ్ చేయాలి
ABN , First Publish Date - 2021-01-28T06:05:50+05:30 IST
నాంపల్లి మండలం పాటిమీదగూడెం హత్య ఘటనలో నిందితులకు వత్తాసు పలుకుతున్న ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు.
మృతదేహంతో బంధువుల ధర్నా
దేవరకొండ, జనవరి 27: నాంపల్లి మండలం పాటిమీదగూడెం హత్య ఘటనలో నిందితులకు వత్తాసు పలుకుతున్న ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట మృతదేహంతో బుధవారం ధర్నా చేశారు. పాటిమీదిగూడెం గ్రామానికి చెందిన బోదా సు వెంకటయ్యను అతని అన్న కృష్ణయ్య, కుమారులు భూవివాదంతో ఈ నెల 26న హత్య చేశారు. దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతుడి భార్య అలివేలు, బంధువులు తమకు న్యాయం చేయాలని మృతదేహంతో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట అరగంట పాటు ధర్నా చేశారు. నిందితు లకు వత్తాసు పలుకుతున్న నాంపల్లి ఎస్‌ఐను సస్పెండ్ చేయాలని, నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, భూసమస్య పరిష్కరించాలన్నారు. ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించడంతో దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి విచారించి ఎస్‌ఐపై చర్య తీసుకుంటామని హామీఇచ్చారు. డీఎస్పీ హామీ మేరకు మృతుడి బంధువులు ధర్నా విరమించారు. కాగా పాటిమిదిగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.