కారులో తరలిస్తున్న రూ.4కోట్ల హవాలా డబ్బు పట్టివేత
ABN , First Publish Date - 2021-10-20T18:07:20+05:30 IST
హైదరాబాద్ - విజయవాడ హైవేపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
నల్గొండ: హైదరాబాద్ - విజయవాడ హైవేపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.4 కోట్ల హవాలా డబ్బును చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళుతున్న TS10 EY 6160 నెంబర్ గల కారులో డబ్బు పట్టుబడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.