నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-02-06T13:48:20+05:30 IST

జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లి మండలం మల్లాపురంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య

నల్లగొండ: జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లి మండలం మల్లాపురంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.  గ్రామానికి చెందిన మేడబోయిన మీనయ్యను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వ్యవసాయపొలం వద్ద హత్య చేశారు. మీనయ్య కాళ్లు, చేతులు నరికి ఘోరంగా చంపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య భూతగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-02-06T13:48:20+05:30 IST