నల్లగొండలో ఒక్కరోజే కరోనాతో 14మంది మృతి

ABN , First Publish Date - 2021-05-05T13:30:09+05:30 IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనాతో నిన్న ఒక్కరోజే 14 మంది మృత్యువాతపడ్డారు.

నల్లగొండలో ఒక్కరోజే కరోనాతో 14మంది మృతి

నల్లగొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనాతో నిన్న ఒక్కరోజే 14 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 2,234 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నల్గొండ జిల్లాలో 1,213, సూర్యాపేట జిల్లాలో 593, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 528 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2021-05-05T13:30:09+05:30 IST