పారదర్శకంగా పని చేయాలి:ఎస్పీ

ABN , First Publish Date - 2021-12-28T06:18:32+05:30 IST

నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా పనిచేయాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పారదర్శకంగా పని చేయాలి:ఎస్పీ
మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేట క్రైం, డిసెంబరు 27: నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా పనిచేయాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసులు పెండింగ్‌ ఉంచకుండా, సత్వరమే న్యాయం జరిగేలా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. బ్లూకోర్ట్‌, పెట్రోకార్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి వేగంగా వెళ్లాని, ప్రజల నుంచి ఫిర్యాదులకు వెంటనే స్పం దించాలన్నారు. ప్రజలు, కాలనీల్లో, వ్యాపారులు వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌ బెట్టింగులు, జూదానికి పందేలు నిర్వహించవద్ద న్నా రు. ఆన్‌లైన్‌లో జరిగే మోసాల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసిన సిబ్బందికి రివార్డులు అందజేశారు. పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది సంక్షేమంలో భాగంగా శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. గ్రీవెన్స్‌లో భాగంగా సోమవారం ఫిర్యాదు దారుల నుంచి తొమ్మిది ఫిర్యాధులు స్వీకరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు రఘు, మోహన్‌కుమార్‌, సీఐ ఆంజనేయులు, విఠల్‌రెడ్డి, శివరాంరెడ్డి, రాజేష్‌, ఆంజనేయులు, రామలింగారెడ్డి, నర్సింహ్మారావు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, నర్సింహ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-28T06:18:32+05:30 IST