హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2021-12-25T05:38:14+05:30 IST

వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు అన్నారు.

హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ ఎస్‌. మోహన్‌రావు

సూర్యాపేట(కలెక్టరేట్‌), డిసెంబరు 24 : వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, ఫోరం సభ్యులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వినియోగదారుల ఫోరం సేవలు అభినందనీయమని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 15 ఫోరంలు పనిచేస్తున్నాయన్నారు. వస్తువుల కొనుగోళ్లతో నష్టం కలిగితే నేరుగా ఫోరంలో అప్పిల్‌ చేసుకొని నష్టపరిహారం పొందాలన్నారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుపై బిల్లులు తీసుకోవడం వినియోగదారుల హక్కని, నాణ్యతా ప్రమాణాలు లేని వస్తువులపై సంబంధిత అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. దీంతో వినియోగదారులకు న్యాయం జరుగుతుందన్నారు. ఫోరం సభ్యులు వినియోగదారులను చైతన్య పర్చేందుకు జిల్లా అంతటా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎ్‌సవో విజయలక్ష్మి, డీఎం రాంపతి, ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-25T05:38:14+05:30 IST