రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి : జేడీఏ

ABN , First Publish Date - 2021-12-28T06:44:32+05:30 IST

పాస్‌పుస్తకాలు పొందిన, పాస్‌ పుస్తకాలు ఉండి రై తుబంధుకు దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 30వ తేదీ వరకు రైతుబంధుకు ద రఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి : జేడీఏ

రామగిరి, డిసెంబరు 27: పాస్‌పుస్తకాలు పొందిన, పాస్‌ పుస్తకాలు ఉండి రై తుబంధుకు దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 30వ తేదీ వరకు రైతుబంధుకు ద రఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. రైతు బంధు దరఖాస్తు చేసుకోవడానికి కొత్త పాసు పుస్తకంతో పాటు ఆధార్‌కార్డు జీరాక్స్‌, బ్యాంకు పాసు పుస్తకంతో సంబంధిత ఏఈఓ వద్ద దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గతంలో రైతుబంధు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అదేవిధంగా గతంలో ఇచ్చిన బ్యాంకు ఖాతా నెంబరు మార్చుకోవాలన్నా దరఖాస్తు చే సుకోవచ్చన్నారు. అర్హులైన రైతులందరికీ నేటి నుంచి రైతుబంధు వారి ఖాతాల్లో జమ కానున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-12-28T06:44:32+05:30 IST