ఆరుతడి పంటలకే మూసీ నీరు

ABN , First Publish Date - 2021-12-19T05:55:18+05:30 IST

ఆరుతడి పంటలకే మూసీ నీటిని ఉపయోగిం చుకోవాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు.

ఆరుతడి పంటలకే మూసీ నీరు
మూసీ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తున్న నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

సూర్యాపేట రూరల్‌, డిసెంబరు 18: ఆరుతడి పంటలకే మూసీ నీటిని ఉపయోగిం చుకోవాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. మూసీ ప్రాజెక్టు ఆయకట్టుకు కుడి, ఎడమ కాల్వల ద్వారా శనివారం నీటిని విడుదల చేసి ఆయన మాట్లాడారు. తెలంగా ణ రాష్ట్రం ఏర్పాటు నాటి నుంచి దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత విద్యుత్‌ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఓట్లకోసం రైతులతో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని రైతులే గద్దె దించుతారని తెలిపారు. కార్యక్రమంలో ఈఈ భద్రూనాయక్‌, ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, వైస్‌ ఎంపీపీ శ్రీనివాసనాయుడు, సర్పంచ్‌ మిట్టు వినోద్‌, కక్కిరేణి నాగయ్యగౌడ్‌, ఏఈలు స్వప్న, ఉదయ్‌కుమార్‌, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-19T05:55:18+05:30 IST