‘పట్టణ అభివృద్ధిపై మునిసిపల్‌ చైర్మన్‌ నిర్లక్ష్యం’

ABN , First Publish Date - 2021-12-08T06:25:42+05:30 IST

ఆలేరు మునిసిపాలిటీలో అభివృద్ధి, సమస్యలపై మునిసిపల్‌ చైర్మన్‌ శంకరయ్య నిర్లక్ష్యం వహిస్తున్నారని ఐదో వార్డు కౌన్సి లర్‌ టంగు భూపతి అన్నారు.

‘పట్టణ అభివృద్ధిపై మునిసిపల్‌ చైర్మన్‌ నిర్లక్ష్యం’

ఆలేరు, డిసెంబరు 7: ఆలేరు మునిసిపాలిటీలో అభివృద్ధి, సమస్యలపై మునిసిపల్‌ చైర్మన్‌ శంకరయ్య నిర్లక్ష్యం వహిస్తున్నారని ఐదో వార్డు కౌన్సి లర్‌ టంగు భూపతి అన్నారు. అలేరులో  మంగళవారం ఆయన విలేకరు తో మాట్లాడారు. చైర్మన్‌గా ఎన్నికైనప్పటి నుంచి శంకరయ్య  సొంత పను లకే ప్రాధాన్యం ఇస్తూ మునిసిపాలిటీ పనులపై నిర్లక్ష్యం వహిస్తున్నా రన్నారు. శ్మశాన వాటిక నిర్మాణ పనులు ప్రారంభించలేదన్నారు.  హరిత హారం, పట్టణ ప్రగతి, మొరం పనుల్లో  అక్రమంగా బిల్లులు డ్రాచేశార న్నారు.  పట్టణంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందన్నారు.  నిధుల దుర్వి నియోగంపై  విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ శ్రీని వాసరెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారుUpdated Date - 2021-12-08T06:25:42+05:30 IST