అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

ABN , First Publish Date - 2021-12-28T05:37:29+05:30 IST

అరె్‌స్టలతో ప్రజాఉద్యమాలను అణచివేయలేరని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు.

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
ఆత్మకూర్‌(ఎస్‌)లలో కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసుల

హుజూర్‌నగర్‌ / నడిగూడెం / పెన్‌పహాడ్‌ / చిలు కూరు / నేరేడుచర్ల / ఆత్మకూర్‌(ఎస్‌) / అర్వపల్లి / తిరుమలగిరి / తుంగతుర్తి, డిసెంబరు 27 : అరె్‌స్టలతో ప్రజాఉద్యమాలను అణచివేయలేరని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. మెదక్‌ జిల్లాలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్‌ నాయకులను జిల్లాలోని పలు మండలాల్లో ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇమాండ్‌ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌ నాయకులను ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని అన్నారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణిని విడనాడాలన్నారు. హుజూర్‌నగర్‌లో యరగాని నాగన్న, సాముల శివారెడ్డి, సంపత్‌రెడ్డి, మహే్‌షగౌడ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నడిగూడెంలో ఎంపీటీసీ గుండుశ్రీనివాస్‌, శ్రీనివాస్‌, దున్నా శ్రీనివాస్‌లను పెన్‌పహాడ్‌లో కేశగాని లక్ష్మణ్‌బాబు గౌడ్‌, ఒగ్గు శంకర్‌, ఒగ్గు రవిలను, చిలుకూరులో గ్రామశాఖ అద్యక్షుడు షేక్‌ సోందూ, మండల యూత్‌ కార్యదర్శి దొంతగాని నర్సింహారావు, సంక్రాంతి విజయ్‌శేఖర్‌, కొండా నరేష్‌, బాలెబోయిన వెంకన్నలను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించే వారిని చూసి ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్‌ పార్టీ నేరేడుచర్ల పట్టణ అధ్యక్షుడు నూకల సందీ్‌పరెడ్డి అన్నారు. ఆయనతో పాటు నాయకులు తాళ్ల రామకృష్ణారెడ్డి, బాష, బచ్చలకూరి ప్రకాష్‌, నాగయ్య, పాండు నాయక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఆత్మకూర్‌(ఎ్‌స)లో పార్టీ మండల అధ్యక్షుడు కందాళ వెంకట్‌రెడ్డి, నాయకులు సిగ శ్రీనివా్‌సగౌడ్‌, తంగెళ్ల లక్ష్మిలను అర్వపల్లిలో తుంగతుర్తి నియోజకవర్గ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, నర్సింగ శ్రీనివా్‌సగౌడ్‌, శిగ నసీర్‌గౌడ్‌, మాదగాని విక్రం, మామిడి రాజులను పోలీసులు ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తిరుమలగిరి, తుంగతుర్తి మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అదుపులోకి తీసుకున్నారు. 



Updated Date - 2021-12-28T05:37:29+05:30 IST