మదర్‌థెరిస్సా జీవితం ఆదర్శం

ABN , First Publish Date - 2021-08-27T05:57:47+05:30 IST

మదర్‌థెరిస్సా జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని విద్యుత్‌ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేం ద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన మదర్‌థెరిస్సా జయంతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్‌థెరిస్సా జీవితమంతా

మదర్‌థెరిస్సా జీవితం ఆదర్శం
సూర్యాపేటలో కేక్‌ తిన్పిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

విద్యుత్‌ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి 

సూర్యాపేట కల్చరల్‌/ హుజూర్‌నగర్‌/ కోదాడ రూరల్‌/ కోదాడ టౌన్‌, ఆగస్టు 26: మదర్‌థెరిస్సా జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని విద్యుత్‌ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. జిల్లాకేం ద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన మదర్‌థెరిస్సా జయంతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్‌థెరిస్సా జీవితమంతా సమాజ సేవకే అంకితం చేశారని కొనియాడారు. మానవతావాది, పేద ప్రజలకు అనేక సేవలు చేసి అంతర్జాతీయంగా కీర్తి పొందారన్నారు. తోటివారి పట్ల స్నేహగుణాన్ని, సమాజ సేవ గుణం కలిగి ఉండాలన్నారు. యువత చెడుకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో దుర్గం ప్రభాకర్‌, డేవిడ్‌రాజు, ఏలియారాజు, బాలాజినాయక్‌, ప్రకాష్‌, జీవరత్నం, మత్తై, ఆంథోని, సుధాకర్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌ లో డీఎస్‌ఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మదర్‌ థెరిసా జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో దగ్గుపాటి బాబూరావు, సత్యాం దం, ప్రసాద్‌, శివ,కమల్‌, గోపి, సాయి, పాల్గొన్నారు. కోదాడలోని శనగల రాధాకృష్ణ మానసిక దివ్యాంగుల సేవా సమితిలో టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో ఎం పీపీ కవితా రాధారెడ్డి, ఇర్ల రోజా రమణి, కౌన్సిలర్‌ మేదరి లలిత, సైదాబి, మీసాల శోభారాణి, శెట్టి సురేష్‌, మస్తాన్‌, మౌలానా పాల్గొన్నారు. కోదాడ పట్టణంలోని మధర్‌థెరిస్సా విగ్రహానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ పూల మాలలు వేసి  నివాళులర్పించారు. మధర్‌థెరిస్సా జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తోటివారి పట్ల స్నేహగుణాన్ని, సమాజ సేవ గుణం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కవితారెడ్డి, వనపర్తి లక్ష్మీనారాయణ, మధుసూదన్‌, లలితా, రోజారమణి, సుశీలరాజు, ఉపేంద్రగౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నాగేంద్రబాబు, రవి, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-27T05:57:47+05:30 IST