నిరాడంబరంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణం

ABN , First Publish Date - 2021-06-21T05:52:01+05:30 IST

మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం రేణుకాఎల్లమ్మ, జమదగ్ని మహాముని కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. కల్యాణానికి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి హాజరై పట్టువస్త్రాలు, వడిబియ్యం సమర్పించారు.

నిరాడంబరంగా రేణుకా ఎల్లమ్మ కల్యాణం
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

హాజరైన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి


కనగల్‌, జూన్‌ 20 : మండలంలోని దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం రేణుకాఎల్లమ్మ, జమదగ్ని మహాముని కల్యాణ మహోత్సవం నిరాడంబరంగా జరిగింది. కల్యాణానికి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి హాజరై పట్టువస్త్రాలు, వడిబియ్యం సమర్పించారు. వరుసగా రెండో ఏడాది కరోనా కారణంగా భక్తులను అమ్మవారికి కల్యాణానికి అనుమతించలేదు. కొవిడ్‌ నిబంధనల నడుమ మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ కల్యాణతంతును ఆలయ ప్రధాన అర్చకుడు మల్లాచారి, శ్రవణ్‌కుమారాచార్యులు నిర్వహించారు. భక్తుల అనుమతి నిరాకరణ నేపథ్యంలో ఎల్లమ్మ కల్యాణాన్ని యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆలయం వద్ద ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఎస్‌ఐ సతీ్‌షరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో నల్లగొండ మునిసిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి, జడ్పీటీసీ చిట్లవెంకటేశంగౌడ్‌, ఈవో ప్రభాకర సత్యమూర్తి, చైర్మన్‌ యాదగిరి, ఏఎంసీ చైర్మన్‌ సుధాకర్‌, సింగిల్‌ విండో చైర్మన్లు సహదేవరెడ్డి, శ్రీను, యాదగిరిగౌడ్‌, సుమతి, ఎంపీటీసీ శైలజ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:52:01+05:30 IST