ఆర్టీవో కార్యాలయానికి మంత్రి
ABN , First Publish Date - 2021-10-29T06:07:47+05:30 IST
జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి గురువారం వెళ్లారు. తన వాహన రుణ క్లియరెన్స్ కోసం ఏ ఆర్భాటం లేకుండా అందరిలాగానే అధికారి దగ్గరికి వెళ్లి ఫైల్స్‌పై సంతకం చేసి ఫొటో దిగారు.
వెహికల్ ఫైనాన్స్ క్లియరెన్స్ ఫైల్స్‌పై సంతకం కోసం..
సూర్యాపేటరూరల్, అక్టోబరు 28 : జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి గురువారం వెళ్లారు. తన వాహన రుణ క్లియరెన్స్ కోసం ఏ ఆర్భాటం లేకుండా అందరిలాగానే అధికారి దగ్గరికి వెళ్లి ఫైల్స్‌పై సంతకం చేసి ఫొటో దిగారు. మంత్రి హోదాలో ఉండి కూడా సాధారణ వ్యక్తిలా తన పని కోసం రవాణా శాఖ కార్యాలయానికి రావడంతో అధికారులు, అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన వెంట డీసీఏంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్ ఉన్నారు.
హార్మోనిస్టు చంద్రశేఖర్ మృతి బాధాకరం: మంత్రి
సూర్యాపేట కల్చరల్ : ప్రముఖ హార్మోనిస్టు పానుగంటి చంద్రశేఖర్ మృతి బాధాకరమని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి వెంట డీసీసీబీ చైర్మన్ జానయ్యయాదవ్, మునిసిపల్ చైర్‌పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్ పాల్గొన్నారు.