క్రీడలతో మానసిక ఉల్లాసం: జడ్పీ చైర్‌పర్సన్
ABN , First Publish Date - 2021-01-20T05:59:15+05:30 IST
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికాయుగందర్‌రావు అన్నారు.

తుంగతుర్తి, జనవరి 19 : క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికాయుగందర్‌రావు అన్నారు. మండల కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి క్రికెట్ పోటీల విజేతలకు మంగళవారం ఆమె బహుమతులను అందజేసి మాట్లాడారు. క్రీడలతో యువతలో నాయకత్వ లక్షణలు పెంపొందుతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి పోటీలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి, ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, శ్రీశైలం, రమే్‌షగౌడ్, భిక్షం పాల్గొన్నారు.