సాగర్‌లో రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ సభ్యుడు

ABN , First Publish Date - 2021-02-06T05:43:10+05:30 IST

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ సభ్యుడు గుగులోత్‌ శంకర్‌నాయక్‌ శుక్రవారం సందర్శించారు.

సాగర్‌లో రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ సభ్యుడు
సాగర్‌ ప్రధాన డ్యాం పరిశీలిస్తున్న రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ సభ్యుడు శంకర్‌నాయక్‌

నాగార్జునసాగర్‌, ఫిబ్రవరి 5 : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ సభ్యుడు గుగులోత్‌ శంకర్‌నాయక్‌ శుక్రవారం సందర్శించారు. హైదరాబాద్‌ నుంచి సాగర్‌కు చేరుకున్న ఆయన్ని హిల్‌కాలనీ విజయవిహార్‌ అతిథి గృహంలో స్థానిక గిరిజన సంఘం నాయకులు కలిసి ఘనంగా సన్మానించారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన సాగర్‌ ప్రధాన డ్యాం, జల విద్యుత్‌ కేంద్రం, గ్యాలరీలను తిలకించారు. అనంతరం బుద్ధవనం ప్రాజెక్టును సందర్శించారు. ఆయన వెంట గిరిజన సంఘం నాయకులు ఆంగోతు భగవాన్‌నాయక్‌, రమావత్‌ దినే్‌షనాయక్‌, వినోద్‌నాయక్‌, చందులాల్‌ నాయక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-02-06T05:43:10+05:30 IST