వెల్వర్తి చెక్‌ పవర్‌ కోసం సమావేశం

ABN , First Publish Date - 2021-05-18T06:58:52+05:30 IST

మండలంలోని వెల్వర్తి గ్రామ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ను కలెక్టర్‌ సస్పెండ్‌ చేయగా ఆ గ్రామంలో జరగబోయే పలు అభివృద్ధి పనుల కొనసాగింపునకు చెక్‌పవర్‌ కోసం సోమవారం వార్డు సభ్యులతో అధికారులు సమావేశం నిర్వహించారు.

వెల్వర్తి చెక్‌ పవర్‌ కోసం సమావేశం

 వలిగొండ, మే 17: మండలంలోని వెల్వర్తి గ్రామ సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ను  కలెక్టర్‌ సస్పెండ్‌ చేయగా ఆ గ్రామంలో జరగబోయే పలు అభివృద్ధి పనుల కొనసాగింపునకు చెక్‌పవర్‌ కోసం సోమవారం వార్డు సభ్యులతో అధికారులు సమావేశం నిర్వహించారు. వారిలో కడవేరు సరోజ, బూడిద బిక్షమయ్యకు చెక్‌ పవర్‌ ఇవ్వాలని మెజార్టీ సభ్యులు అంగీకరించి, తీర్మానించారు. ఈ నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి అందించనున్నట్లు ఎంపీవో విలేకరులకు తెలిపారు.  సమావేశంలో ఎంపీవో కేధారీశ్వర్‌, వార్డు సభ్యులు ముత్యాలు, కళమ్మ, కవిత, విజయ లక్ష్మి, రాములు, మల్లేశం పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-18T06:58:52+05:30 IST