గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-12-08T07:02:43+05:30 IST

కొండమల్లేపల్లి మండల కేంద్రం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 600 గ్రాముల గంజాయిని కొండమల్లేపల్లి బస్టాండ్‌లో మంగళవారం పట్టుకున్నారు.

గంజాయి పట్టివేత

కొండమల్లేపల్లి, డిసెంబరు 7:  కొండమల్లేపల్లి మండల కేంద్రం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 600 గ్రాముల గంజాయిని కొండమల్లేపల్లి బస్టాండ్‌లో మంగళవారం పట్టుకున్నారు. కొండమల్లేపల్లి ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కొండమల్లేపల్లి మండల కేంద్రానికి చెందిన షేక్‌ బాబు(గుండుబాబా) అనే వ్యక్తి రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా మాచర్లలో గంజాయిని కొనుగోలు చేసి కొండమల్లేపల్లి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు.   దీని విలువ సుమారు రూ.8వేలు ఉంటుందని తెలిపారు. కొండమల్లేపల్లి మండల తహసీల్దార్‌ సరస్వతికి ఈ విషయమై సమాచారం అందించారు.  

Updated Date - 2021-12-08T07:02:43+05:30 IST