రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-12-09T06:51:50+05:30 IST
హైదరాబాద్ -నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై బుధవారం రాత్రి చింతపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

చింతపల్లి, డిసెంబరు 8: హైదరాబాద్ -నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై బుధవారం రాత్రి చింతపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. మండలంలోని చాకలిశేరిపల్లి గ్రామానికి చెందిన ఆకుతోట జగతయ్య గుప్తా(45) కొలుకులపల్లి ఫార్ బాయిల్డ్ రైస్‌మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి రహదారిపై నడుచుకుంటు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం జగతయ్యగుప్తాను ఢీకొట్టడంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. జగతయ్యగుప్తా భార్య ఐదు సంవత్సరాలక్రితమే మృతి చెందగా ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీ్‌సస్టేషన్ పరిధి రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి రావడంతో మాడ్గుల ఎస్‌ఐ రమేష్ మృతదేహాన్ని కల్వకుర్తి సివిల్ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.