మోత్కూరులో వడ్డీ వ్యాపారి వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-02T06:13:27+05:30 IST

బంధువు అప్పుకు జమానతుగా ఉండటం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది.

మోత్కూరులో వడ్డీ వ్యాపారి వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య
ఫణిరాజు (ఫైల్‌)

మోత్కూరు, నవంబరు 1: బంధువు అప్పుకు జమానతుగా ఉండటం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. వడ్డీ వ్యాపారి వే ధింపులు భరించలేక మోత్కూరుకు చెందిన కడమంచి ఫణిరాజు (38) అనే వ్యక్తి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్ప డిన సంఘటన సోమవారం వెలుగులోకి వ చ్చింది. మృతుని భార్య కడమంచి శాకమ్మ, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... మోత్కూరు పట్టణంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వెనుక ప్రాంతంలో కడమంచి ఫణిరా జు(38), పత్తి బాషా నివాసం ఉంటున్నారు. పత్తి బాషా ప్రైవేట్‌ చిట్టీలు నడపటంతో పాటు వడ్డీలకు డబ్బులు ఇస్తుంటాడు. బాషా వద్ద ఫణిరాజు రూ.7 లక్షల చీటీ వేశాడు. తిరుమలగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన ఫణిరాజు బంధువు కుమారుడు నర్సింహ మూడేళ్ల కిందట రూ.1.20 లక్షలు బాషా వద్ద వడ్డీకి అప్పు తీసుకుని రూ.60 వేలు చెల్లించాడు. మిగతావి చెల్లించకపోవడంతో ఆ అప్పుకు ఫణిరాజు జమానతు(హామీ)గా ఉన్నాడు. ఆ సమయంలో ఫణిరాజు ఇల్లు, ప్లాట్‌ కాగితాలను బాషా తీసుకున్నాడు. ఈ నెల 20వ తేదీన ఫణిరాజు తన కుమార్తె వివాహం చేసేందుకు ముహూర్తం పెట్టుకున్నాడు. పెళ్లి ఖర్చుల కోసం బాషా వద్ద వేసిన చీటీ ఎత్తడానికి వెళ్లగా నర్సింహ బాకీ ఇస్తేనే చీటీ డ బ్బులు ఇస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కుమార్తె పెళ్లి ఎలా చేయాలన్న మనస్తాపంతో ఫణిరాజు గత శనివారం ఇంట్లో అంతా నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఫణిరాజు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. ఫణిరాజు మృతికి కారకుడైన బాషా నుంచి పరిహారం ఇప్పించేందుకు కులపెద్దలు, గ్రామస్థులతో చర్చలు విఫలం కావడంతో వారు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫణిరాజు కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు బాషాపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం సాయంత్రం ఫణిరాజు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2021-11-02T06:13:27+05:30 IST