ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా మహేష్‌

ABN , First Publish Date - 2021-12-20T05:25:27+05:30 IST

ఏఐవైఎఫ్‌ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మో త్కూరు కేఆర్‌ భవనలో జరిగిన ఏఐవైఎఫ్‌ జిల్లా మ హాసభలో శనివారం రాత్రి ఎన్నుకున్నారు.

ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడిగా మహేష్‌
వెల్లంకి మహేష్‌

మోత్కూరు, డిసెంబరు 19: ఏఐవైఎఫ్‌ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మో త్కూరు కేఆర్‌ భవనలో జరిగిన ఏఐవైఎఫ్‌ జిల్లా మ హాసభలో శనివారం రాత్రి ఎన్నుకున్నారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఆ సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా వెల్లంకి మహేష్‌, ఉపాధ్యక్షులు పేరబోయిన శంకర్‌, కొండూరు వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పేరబోయిన మహేందర్‌, సహాయ కార్యదర్శులు మహమ్మద్‌ నయీం, బత్తుల శ్రీను, కో శాధికారి మొగుళ్ల శేఖర్‌రెడ్డితో పాటు 18 మందిని కార్యవర్గ సభ్యులుగా, 37 మం దిని కౌన్సిల్‌ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. యువత సమస్యలపై నూతన కమిటీ ఎప్పటికప్పుడు స్పందిస్తూ, సమస్యలను పరిష్కరించేందు కు పోరాడుతుందన్నారు.


Updated Date - 2021-12-20T05:25:27+05:30 IST