మహారణం తెలంగాణ సాయుధ పోరాటం

ABN , First Publish Date - 2021-12-31T06:06:56+05:30 IST

వెట్టి చాకిరీ విముక్తి కోసం ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన మహారణం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, కవి, రచయిత డాక్టర్‌ బెల్లి యాదయ్య అన్నారు.

మహారణం తెలంగాణ సాయుధ పోరాటం
వీర తెలంగాణ వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్న కళాకారులు

 కవి, రచయిత డాక్టర్‌ బెల్లి యాదయ్య

రామన్నపేట, డిసెంబరు 30:  వెట్టి చాకిరీ విముక్తి కోసం ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన మహారణం తెలంగాణ  సాయుధ  రైతాంగ పోరాటమని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, కవి, రచయిత డాక్టర్‌ బెల్లి యాదయ్య అన్నారు. ఎస్‌ఎ్‌ఫఐ 52వ ఆవిర్భావ దినోత్వం సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వీర తెలంగాణ వీధి నాటక  ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బెల్లి యాద య్య మాట్లాడుతూ నాటి వీరోచిత పోరాటాన్ని వీధి నాటకం రూపంలో కళ్లకు కట్టినట్టు చూపించడం అభినందనీయమని అన్నారు. మన పూర్వీకుల జీవన విధానం అంతా పోరాటమే అన్నారు. ఎన్నో బలిదానాల చరిత్ర తెలంగాణ సమాజానిదన్నారు. సామాన్యులను సాయుఽధులను చేసిన ఘనత నాటి పోరాటానిదన్నారు. ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాటం చేయాలని అన్నారు. మహోజ్వలంగా జరిగిన పోరాటం నేటి విద్యార్ధులకు తెలిసేలా ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేర్చి వివరించాలన్నారు. నాటకానికి ప్రారంభ సూచికంగా స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాల జెండాను ఆవిష్కరించారు. మేకల జలందర్‌ అద్యక్షత జరిగిన  ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి జిల్లా కళాకారుల వీర తెలంగాణ వీధి నాట కం ఆకట్టుకుంది. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ నాగటి ఉపేందర్‌, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా అధ్యక్షుడు వనం రాజు, మండల కార్యదర్శి బండ్ల పవణ్‌, గర్ల్స్‌ కన్వినర్‌ మౌనిక, ఆవనగంటి హరిష్‌, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంటెపాక శివ కుమార్‌, దేశపాక రవి, కందుల హనుమంతు, పొట్లచెర్వు గాయత్రి, గన్నెబోయిన ఆదిత్య, బత్తిని సందీప్‌, మహేష్‌, కుమ్మరి శంకర్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-31T06:06:56+05:30 IST