మాధవరెడ్డి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-02T06:48:57+05:30 IST

మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి జీవితాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అన్నారు.

మాధవరెడ్డి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
భువనగిరిలో మాధవరెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న సందీప్‌రెడ్డి

 జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి 

 భువనగిరి రూరల్‌/ భూదాన్‌పోచంపల్లి/చౌటుప్పల్‌ టౌన్‌, మే 1: మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి జీవితాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అన్నారు. మాధవరెడ్డి జయంతిని పురస్కరించుకొని శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి, మాట్లాడారు. రాష్ట్ర, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి మాధవరెడ్డి ఎంతగానో కృషి చేశారన్నారు. మండలంలోని వడపర్తిలో మాదవ ఘాట్‌వద్ద పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి, ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులు నివాళి అర్పించారు. పట్టణంలోని మాధ వరెడ్డి విగ్రహానికి మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, మాజీ చైర్మన్‌ పెంట నర్సింహ, నాయకులు డొప్ప వెంకటేష్‌, అతికం లక్ష్మీనారాయణ, ఇట్టబోయిన గోపాల్‌, ఏవీ కిరణ్‌, దాసరి శ్రీనివాస్‌, బచ్చు వెంకటేష్‌ అర్పించారు.  ఎలిమినేటి మాధరెడ్డి ఆశయాలసాధనకు కృషి చేద్దామని ఎలిమినేటి మాధవరెడ్డి యువసేన రాష్ట్ర కన్వీనర్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు ముత్యాల మహిపాల్‌రెడ్డి అన్నారు. మాధవరెడ్డి జయంతి వేడుకలు  భూదాన్‌పోచంపల్లి మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమాల్లో ఎలిమినేటి యువసేన రాష్ట్ర కన్వీనర్‌ ముత్యాల మహిపాల్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామి, టీఆర్‌ఎస్‌ మండల కమిటీ అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, పట్టణ కమిటీ అధ్యక్షులు సీత వెంకటేష్‌, సర్పంచులు సామల రవీందర్‌రెడ్డి, పగిల్ల స్వప్నరాంరెడ్డి, దుర్గం స్వప్న నరేష్‌, ఎంపీటీసీ చిల్లర జంగయ్యయాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కందాడి భూపాల్‌రెడ్డి, నోముల మాధవరెడ్డి, కౌన్సిలర్లు సామల మల్లారెడ్డి, గుండు మధు, నాయకులు గునిగంటి మల్లే్‌షగౌడ్‌  పాల్గొన్నారు.  మాధవరెడ్డి ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని చౌటుప్పల్‌ మండల టీడీపీ అధ్యక్షుడు ఎండి.హన్నూబాయి అన్నారు.  మాధవరెడ్డి  జయంతి సందర్బంగా శనివారం చౌ టుప్పల్‌ పట్టణంలోని  మాధవరెడ్డి విగ్రహానికి మండల అధ్య క్షుడు ఎండి.హన్నూబాయి, నాయకులు ఎస్‌డీ. వహీద్‌, తడక కోటేశ్వర్‌, నల్ల పర్వతాలు, టి.శ్రీనువాస్‌ గౌడ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాధవరెడ్డి విగ్రహానికి పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ చెన్నగోని అంజయ్య గౌడ్‌, మాజీ సర్పంచ్‌ ఊదరి నర్సింహ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - 2021-05-02T06:48:57+05:30 IST