బదిలీలు, పదోన్నతుల్లో స్థానికులకు ప్రాధాన్యమివ్వాలి
ABN , First Publish Date - 2021-12-10T05:17:15+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంలో స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని టీజీవో జి ల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి అన్నారు.

టీజీవో జిల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి
భువనగిరి రూరల్, డిసెంబరు 9: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంలో స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలని టీజీవో జి ల్లా అధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి అన్నారు. గురువారం భువనగిరిలో జరిగిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, జోనల్, మల్టీజోనల్ విధానం అమలు చేయకముందే బదిలీలకి సంబంధించి ఖాళీల ను ప్రకటించాలన్నారు. అదేవిధంగా భార్యాభర్తలు, దివ్యాంగులు, వితం తు ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇ వ్వాలని కోరారు. ఉద్యోగస్థులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 4 డీఏల ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు 11వ పీఆర్‌సీ లోపాలను సరి చేయాలన్నారు. సమావేశంలో టీజీవో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, నాయకులు అజీజ్‌అలీ ఖాన, శ్రీధర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.