ఏపీజీవీబీ ద్వారా రూ.2200 కోట్ల రుణాలు
ABN , First Publish Date - 2021-12-30T06:36:50+05:30 IST
ఏపీజీవీబీ ద్వారా 2020-21 సంవత్సరానికి రూ.2200 కోట్ల రుణాలు అందజేసినట్లు రిజినల్ మేనేజర్ ఎస్‌ఎల్‌ఎన్ ప్రసాద్ తెలిపారు. బ్యాంక్ సేవలపై మండలంలోని వింజమూరు గ్రామంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీజీవీబీ ద్వారా రైతులకు, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. సంఘబంధాలకు రూ

రీజినల్ మేనేజర్ ఎస్‌ఎల్‌ఎన్ ప్రసాద్
చింతపల్లి, డిసెంబరు 29: ఏపీజీవీబీ ద్వారా 2020-21 సంవత్సరానికి రూ.2200 కోట్ల రుణాలు అందజేసినట్లు రిజినల్ మేనేజర్ ఎస్‌ఎల్‌ఎన్ ప్రసాద్ తెలిపారు. బ్యాంక్ సేవలపై మండలంలోని వింజమూరు గ్రామంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీజీవీబీ ద్వారా రైతులకు, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. సంఘబంధాలకు రూ.12లక్షల వరకు రుణాలు ఇస్తున్నామని, వచ్చే సంవత్సరం రూ.20లక్షల వరకు ఇస్తామని తెలిపారు. ఏపీజీవీబీ ద్వారా ప్రతి ఖాతాదారుడికీ ఏటీఎంకార్డులు కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో బ్యాంక్‌మిత్ర సేవలు కూడా అందిస్తున్నామన్నారు. ఆధార్, పాన్‌కార్డులుంటే బ్యాంక్‌కు రాకుండా వీడియో కేవైసీ అకౌంట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పీఎంజేజేవై,సురక్ష బీమాయోజన, అటల్‌పెన్షన్‌యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బ్యాంక్ డెస్క్ అధికారి శ్రీనివాస్, చింతపల్లి బ్రాం చ్‌మేనేజర్ బి.చంద్రశేఖర్,ఫీల్డుఆఫీసర్ శిల్ప,సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు.