ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకుందాం : ఎమ్మెల్యే పైౖళ్ల
ABN , First Publish Date - 2021-12-15T05:47:50+05:30 IST
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని చీమలకొండూరు, ముస్త్యాలపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామ

భువనగిరి రూరల్, డిసెంబరు14: ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని చీమలకొండూరు, ముస్త్యాలపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామన్నారు. చీమలకొండూరు ప్రాథమికోన్నత పాఠశాలలో డిప్యుటేషన్‌పై వెళ్లిన టీచర్లను తిరిగి పాఠ శాలకు రప్పించే విదంగా చర్యలు తీసుకోవాలని విద్యా కమిటీ చైర్మన్ వడ్డెబోయిన వెంకటేశం ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, ఏఎంసీ చైర్మన్ నల్లమాస రమేశ్, జనగాం పాండు, కంచి మల్లయ్య, సర్పంచ్‌లు జీలుగు కవిత, గంటెపాక యాదగిరి, ఎంపీటీసీ కంచి లలిత, నాయకులు బల్గూరి మధుసూదన్, లక్ష్మీనారాయణ, అబ్బగాని వెంకట్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.