రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-03-22T05:56:45+05:30 IST

Woman killed in road accident

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

చిట్యాల రూరల్‌, మార్చి 21: మండలంలోని ఉరుమడ్ల గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెం దింది. ఏఎస్‌ఐ జోజి తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణ పురానికి చెందిన నల్లగొండ లింగయ్య, ఆయన భార్య అండాలు(50), వారి మనువరాలు జగతితో కలిసి బైక్‌పై చిట్యాలకు బయలుదేరారు. అండాలు తల్లి ఇటీవల మృతిచెందడంతో నెల మాసికం కార్యక్రమంలో పాల్గొనేందుకు వారు  చిట్యాలకు వచ్చారు. కార్యక్రమం పూర్తయ్యాక శనివారం రాత్రి తిరిగి బైక్‌పై ఉరుమడ్ల మీదుగా వెళ్తుండగా గ్రామ శివారులో పాల వ్యాను బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న లింగయ్య, జగతి, అండాలు రోడ్డుపై పడ్డారు. లింగయ్య, జగ తికి స్వల్ప గాయాలయ్యాయి. అండాలు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం చిట్యాలలోని ఓ ప్రైవేట్‌ తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించి మైరుగైన చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా అండాలు మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాసు పత్రికి తరలించారు. అండాలు భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. ము నుగోడు మండలం ఇప్పర్తికి చెందిన పాల వ్యాను డ్రైవర్‌ మహేశ్వరం బాబూరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

మునుగోడు : మండల కేంద్రంలోని షాదీఖానా ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. చీకటిమామిడి గ్రామానికి చెందిన అనంత జగదీష్‌ బైక్‌పై నల్లగొండకు వస్తుండగా ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో జగదీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-03-22T05:56:45+05:30 IST