టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2021-03-22T05:55:24+05:30 IST

Development is possible only with TRS

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
త్రిపురారంలో కుట్టు మిషన్‌తో బస్తాలు కుడుతున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, సురేందర్‌

తిరుమలగిరి(సాగర్‌)/ త్రిపురారం/ మాడ్గులపల్లి/ నాగార్జునసాగర్‌/ నిడమనూరు/ పెద్దవూర/ హాలియా, మార్చి 21: టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఉప ఎన్నిక మండల ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలు రమా వత్‌ రవీంద్రకుమార్‌, జాజల సురేందర్‌ అన్నారు. తెట్టెకుంట, అల్వాల గ్రామాల్లో ఎమ్మెల్యే సురేందర్‌ పర్యటించారు. గోడుమడక, బట్టువెంకన్న బావితండాలలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ ప్రచారం చేశారు. కార్యక్ర మంలో ఎంపీపీ ఆంగోతు భగవాన్‌నాయక్‌, పిడిగం నాగయ్య, దేవుడునా యక్‌, జానకిరాములు, రవి, దుర్గయ్య, రవినాయక్‌, హరికృష్ణ, పెద్దిరాజు, మల్లిఖార్జున్‌, ముని, వెంకటయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ త్రిపురారం మండలంలో ప్రచారం నిర్వహించారు. కల్లాల వద్ద కుట్టు విషన్‌తో బస్తాలు కుట్టి ఆకట్టుకున్నారు. మాడ్గులపల్లి మండలంలోని కన్నెకల్‌లో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలంటే టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో నాగరాజు, మాధవరెడ్డి పాల్గొన్నారు. నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ రామకృష్ణరావు పాల్గొన్నారు. నిడమనూరు మండలంలోని ఊట్కూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్‌ విరిగినేని అంజయ్య, నాయకులు తాటి సత్యపాల్‌, చేకూరి హన్మంతరావు, బొల్లం రవి, కేశబోయిన జానయ్య, మాచర్ల దాసు పాల్గొన్నారు. పెద్దవూర బట్టుగూడెంలో మండల ఇన్‌చార్జి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గం నుంచి మండలానికి వచ్చిన ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  హాలి యా మండల ఇన్‌చార్జి, కాగజ్‌నగర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మండలంలోని రామడుగులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, కూరాకుల వెంకటేశ్వర్లు, రమణారెడ్డి పాల్గొన్నారు. హాలియా మునిసిపాలిటీ ఇన్‌చార్జి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మునిసిపాలిటీలో ప్రచారం చేశారు. కార్యక్రమంలో యడవెల్లి విజయేందర్‌రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, చైర్మన్‌ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, వైస్‌ చైర్మన్‌ నల్లగొండ సుధాకర్‌, కౌన్సిలర్లు వర్రా వెంకట్‌రెడ్డి, ప్రసాద్‌నాయక్‌, అన్నెపాక శ్రీనివాస్‌, నల్లబోతు వెంకటయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T05:55:24+05:30 IST