ముదిరాజ్‌ల అభివృద్ధికి పెద్దపీట

ABN , First Publish Date - 2021-01-14T04:54:15+05:30 IST

రాష్ట్రంలో ముదిరాజ్‌ల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఈదుల యాదగిరి, తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర యువత ఉపాధ్యక్షుడు ఆకుల రాజేష్‌ అన్నారు.

ముదిరాజ్‌ల అభివృద్ధికి పెద్దపీట
సీఎం, మంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహిస్తున్న నాయకులు

సూర్యాపేటటౌన్‌, జనవరి 13 : రాష్ట్రంలో ముదిరాజ్‌ల అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఈదుల యాదగిరి, తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర యువత ఉపాధ్యక్షుడు ఆకుల రాజేష్‌ అన్నారు. కోర్టు చౌరస్తా వద్ద 18 ఏళ్లు నిండిన ముదిరాజ్‌ యువకులకు మత్స్యపారిశ్రామిక సహకార సంఘంలో సభ్యత్వం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం సీఎం కేసీఆర్‌, మంత్రులు గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, ఈటేల రాజేందర్‌, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, బండ ప్రకాష్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఆకుల లవకుశ, యామిని వీరయ్య, కోల వనిత, ఎల్‌. రామకృష్ణ, భాస్కర్‌, దండు రేణుక, ఇండ్ల సురేష్‌, భద్రినాథ్‌, ఢిల్లీ పావని, సైదులు, వేణు, అంజి, బుచ్చిబాబు, నిరంజన్‌, కోటయ్య, నాగయ్య, ఉపేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T04:54:15+05:30 IST