కన్నుల పండువగా లక్ష్మీనరసింహుడి కల్యాణం
ABN , First Publish Date - 2021-11-26T06:48:27+05:30 IST
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని గురువారం వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన అనంతరం నిత్య కల్యాణాన్ని ఘనంగా చేశారు.

మఠంపల్లి, నవంబరు 25: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని గురువారం వేదపండితులు కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన అనంతరం నిత్య కల్యాణాన్ని ఘనంగా చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నామని ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరా వు, ఈవో సిరికొండ నవీన్ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణమాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామశాస్ర్తి, శేషగిరిరావు, శ్రీనివాసరావు, సీత, తదితరులు పాల్గొన్నారు.