యాదాద్రిలో శాస్త్రోక్తంగా లక్ష్మీ పూజలు

ABN , First Publish Date - 2021-02-06T06:14:32+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం లక్ష్మీపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాలాలయ కవచమూర్తుల ను సువర్ణ పుష్పాలతో అర్చించిన పూజారులు ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసిదళా లు కుంకుమతో అర్చించారు.

యాదాద్రిలో శాస్త్రోక్తంగా లక్ష్మీ పూజలు
ఊరేగింపు నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రి టౌన్‌, ఫిబ్రవరి 5: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం లక్ష్మీపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాలాలయ కవచమూర్తుల ను సువర్ణ పుష్పాలతో అర్చించిన పూజారులు ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసిదళా లు కుంకుమతో అర్చించారు. కల్యాణ మండపంలో  హోమం, నిత్య తిరుకల్యాణపర్వాలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. సాయంత్రంవేళ ఆండాళ్‌ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి ఊంజల్‌ సేవలో తీర్చిదిద్ది వే ద మంత్ర పఠనాలు, మంగళవాయీద్యాల నడుమ సేవోత్సవం నిర్వహించారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో నూ స్వామికి సువర్ణ పుష్పార్చనలు, ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌ సేవోత్సవం సంప్రదాయరీతిలో చేశారు. భక్తుల నుంచి రూ.8,85,264 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. 


తుది దశకు ఎలిఫెంట్‌ ప్యానల్‌ పనులు 

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కొండకు పడమటి దిశలో రిటైనింగ్‌ వాల్‌కు ఎలిఫెంట్‌ ప్యానల్‌ అమర్చే పనులు తుదిదశకు చేరాయి. జీఆర్‌సీ (గ్లాస్‌ రెయిన్‌ ఫోన్స్‌ సిమెంట్‌) పద్ధతిలో ఎలిఫెంట్‌ ప్యానల్‌ను రాజస్థాన్‌ రాష్ట్రం బాగ్మేర్‌ కళాక్షేత్రంలో రూ పొందించారు. యాదాద్రి కొండకు పడమటి దిశలో ఐదు భారీ ఎలిఫెంట్‌ ప్యానళ్లను అమర్చనున్నారు. మూడు ప్యానళ్లను అమర్చిన కార్మికులు మరో రెండింటిని త్వరలో నే అమర్చనున్నట్లు తెలిపారు.  


మట్టపల్లిలో శ్రీలక్ష్మీనృసింహుడి కల్యాణం

మఠంపల్లి: రాష్ట్రంలో రెండో యాదాద్రి మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహుడి క్షేత్రంలో నిత్యాకల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరి విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, ఈవో  పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T06:14:32+05:30 IST