‘సెంట్రల్‌ లైటింగ్‌ పనుల్లో నాణ్యత లేమి’

ABN , First Publish Date - 2021-08-20T06:54:00+05:30 IST

ఆలేరు మునిసిపాలిటీలో నిర్మిస్తున్న సెంట్ర ల్‌ లైటింగ్‌, డివైడర్‌ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించాయని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్‌ ఆరోపించారు

‘సెంట్రల్‌ లైటింగ్‌ పనుల్లో నాణ్యత లేమి’

ఆలేరు రూరల్‌, ఆగస్టు 19: ఆలేరు మునిసిపాలిటీలో  నిర్మిస్తున్న సెంట్ర ల్‌ లైటింగ్‌, డివైడర్‌ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించాయని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్‌ ఆరోపించారు.  జిల్లా ఓబీసీ కార్యదర్శి తునికి దశరథ, పట్టణ ఉపాధ్యక్షుడు కల్లెం రాజుతో కలిసి నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పాలకులు కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నందున పనులు నాసిరకంగా జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ విషయమై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-08-20T06:54:00+05:30 IST