గుండ్లపల్లిలో క్షుద్రపూజల కలకలం
ABN , First Publish Date - 2021-07-08T06:25:26+05:30 IST
మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేగింది. గ్రామ సెంటరులో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ కలిపిన బియ్యం వదిలి వెళ్లారు. వాటిని చూసిన ప్రజలు భయాందోళన చెందారు.

నల్లగొండ క్రైం, జూలై 7: మండల పరిధిలోని గుండ్లపల్లి గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేగింది. గ్రామ సెంటరులో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ కలిపిన బియ్యం వదిలి వెళ్లారు. వాటిని చూసిన ప్రజలు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సిబ్బందితో గుండ్లపల్లి గ్రామం వెళ్లి గ్రామస్థులకు ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.