టీఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ
ABN , First Publish Date - 2021-04-09T07:08:31+05:30 IST
తెలంగాణ మాదిగ స్టూడెంట్స్ ఫోర్స్ (టీఎంఎస్ఎఫ్) ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా మామిడి కృష్ణ మాదిగ ఎన్నికయ్యారు
నియామకపత్రం అందజేత
సూర్యాపేటటౌన్, ఏప్రిల్ 8: తెలంగాణ మాదిగ స్టూడెంట్స్ ఫోర్స్ (టీఎంఎస్ఎఫ్) ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా మామిడి కృష్ణ మాదిగ ఎన్నికయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆసంఘం రాష్ట్ర అధ్యక్షుడు నకిరేకంటి సైదులు ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ మామిడి కృష్ణమాదిగకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ విద్యారంగం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో శివరామకృష్ణ, రాంబాబు, నరేష్, గంగరాజు, పరమేష్, అజిత్, మహేష్, నాగరాజు, సందీప్, సతీష్ పాల్గొన్నారు.