కొవిడ్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి

ABN , First Publish Date - 2021-05-05T06:23:26+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటిం చాలని పలువురు కోరారు.

కొవిడ్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి
చౌటుప్పల్‌ మండలం దేవలమ్మనాగారంలో కరోనాపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

చౌటుప్పల్‌ టౌన్‌, మే4: కొవిడ్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటిం చాలని పలువురు కోరారు. చౌటుప్పల్‌ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి వద్ద కరోనా వైరస్‌ పరీక్షల కోసం వచ్చే వారికి నీడ కోసం దాతల సహకారంతో వైద్యాధికారి శివప్రసాద్‌రెడ్డి చలువ పందిళ్లను ఏర్పాటు చేయించారు. నిత్యం 100 నుంచి 150 మంది పరీక్షల కోసం వచ్చి ఎండలకు ఇబ్బంది పడుతున్నారు. ఎండల నుంచి కరోనా పరీక్షల దారులను కాపాడేందుకు శివప్రసాద్‌ రెడ్డి దాతల సహకారంతో ఈ ఏర్పాటు చేయించారు. చలువపందిళ్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు గాను ఎంపీపీ తాడూరు వెంకట్‌రెడ్డి రూ.10వేలు విరాళంగా డాక్టర్‌ శివప్రసాద్‌ రెడ్డికి అందజేశారు.

 కరోనా పేషెంట్‌కు సరుకుల పంపిణీ

తుర్కపల్లి(బొమ్మలరామారం): ఆర్యవైశ్య మహాసభ, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ భువనగిరి, వాసవీ క్లబ్‌ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపట్టిన కరోనా బాధితుల సహాయార్థం మండల కేంద్రంలో కరోనా బారిన పడ్డ నిరుపేదకు రెండు వేల రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులను గడ్డం జ్ఞానప్రకాశ్‌రెడ్డి అందజేశారు.  

కరోనాపై అవగాహన

చౌటుప్పల్‌ రూరల్‌ : కరోనాపై రాచకొండ జాగృతి పోలీస్‌ ఆధ్వర్యంలో  దండు మల్కాపురం, తుఫ్రాన్‌పేట, దేవలమ్మ నాగారం గ్రామాల్లో  కళాజాత నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, ఉపాధిహామీ పని ప్రాంతాల్లో ప్రజలకు, కూలీలకు కరోనాపై అవగాహన కల్పించారు. 

ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి

భూదాన్‌పోచంపల్లి : కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉం డాల ని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి కరోనా నివారణకు సహకరించాలని భూదాన్‌పోచంపల్లి ఎస్‌ఐ సైదిరెడ్డి కోరారు. కరోనా నివారణపై రాచకొండ పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో మంగ ళవారం స్థానిక గాంధీ చౌరస్తా వద్ద పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా ఎస్‌ఐ సైదిరెడ్డి మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దుకాణాల వద్ద, మార్కెట్‌ వద్ద భౌతిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో రాచకొండ పోలీసు కళాబృందం ఇన్‌చార్జి నాగ మల్లు, ఏఎస్‌ఐ ఇద్దయ్య, శ్రీనివాస్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

ప్రతి ఒక్కరూ సహకరించాలి

ఆత్మకూరు(ఎం): కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆత్మకూరు(ఎం)పట్టణ సర్పంచ్‌ జె.నగేష్‌, ఎంపీటీసీ యాస కవితా ఇంద్రారెడ్డి కోరారు. ఆల్డా చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి సహకారంతో అందించిన 500 మాస్కులను మంగళవారం మండల కేంద్రంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఎండి ఇద్రీస్‌అలీ, ఎంపీటీసీ యాస కవితా ఇంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల మహిళా అధ్యక్షురాలు ఎస్‌.అరుణ, ఉపసర్పంచ్‌ డి.నవ్య టీఆర్‌ఎస్వీ నాయకుడు బండ సాయి పాల్గొన్నారు.

Updated Date - 2021-05-05T06:23:26+05:30 IST