కన్నుల పండువగా కోటమైసమ్మ బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-11-28T05:59:49+05:30 IST

మండల పరిధిలోని ఇండ్లకోటయ్యగూడెం గ్రామ సమీపంలోని కోటమైసమ్మ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి.

కన్నుల పండువగా కోటమైసమ్మ బ్రహ్మోత్సవాలు
ఆలయ ఆవరణలో బలిచల్లుతున్న భక్తులు

నిడమనూరు, నవంబరు 27: మండల పరిధిలోని ఇండ్లకోటయ్యగూడెం గ్రామ సమీపంలోని కోటమైసమ్మ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం సుప్రభాత సేవ, బాలభోగం, బలిహరణం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలతో వేద మంత్రోచ్ఛరణల నడుమ పూజా కార్యక్రమాలు నేత్రపర్వంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల చివరి రోజైన ఆదివారం అమ్మవారికి బోనాల సమర్పణ, సాయంత్రం కార్తీకదీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చౌటి ఆంజనేయులు, ఈవో సిరికొండ నవీన్‌, ఆలయ సిబ్బంది విఠలేశ్వర్‌, రమణయ్య, రాజు, యాదయ్య, శ్రీనివాస్‌, పద్మ, కోటయ్య, వెంకన్న పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T05:59:49+05:30 IST